Manuguru: మణుగూరులో కండక్టర్ ప్రవళిక మృతిపై భగ్గుమన్న ఆర్టీసీ కార్మికులు!
Manuguru: మణుగూరులో కండక్టర్ ప్రవళిక మృతిపై ఆర్టీసీ కార్మికుల తీవ్ర ఆందోళన. ఖమ్మం రీజియన్‌లో బస్సులు నిలిపివేసి డిపో వద్ద జేఏసీ ధర్నా.
Manuguru: మణుగూరులో కండక్టర్ ప్రవళిక మృతిపై భగ్గుమన్న ఆర్టీసీ కార్మికులు!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మహిళా కండక్టర్ ప్రవళిక మృతిపై ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. గత నెల 25న ఆర్టీసీ బస్సులో కండక్టర్ ప్రవళికకు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన వివాదంలో టికెట్ కోసం చిల్లర డబ్బులు లేని కారణంగా ఒకరి పై ఒకరు వాగ్వాదం చేసుకున్నారు.. అది ముదరటం తో ప్రయాణికురాలు మౌనిక కండక్టర్ ప్రవళిక ను నెట్టడం తో ఆమె కింద పడిపోగా వెనుక బస్ టైర్ ఆమె కాలు మీదనుంచి వెళ్ళింది వెంటనే 108 ద్వారా భద్రాచలం ఆసుపత్రి కి తరలించి వైద్య సేవలు అందించగా పరిస్థితి విషమంగా ఉండటం తో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.. 10 రోజులుగా అక్కడే చికిత్స పొందుతూ ప్రవళిక మృతి చెందడంతో కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రవళిక మృతికి నిరసనగా మణుగూరు ఆర్టీసీ డిపో ఎదుట JAC ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా బస్సుల బంద్‌కు JAC పిలుపునివ్వడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అయితే మణుగూరులో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
ఈ సందర్భంగా JAC నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు బాధ్యురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌనికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రవళిక మృతితో మణుగూరు ఆర్టీసీ డిపోలో విషాదఛాయలు అలుముకున్నాయి.




