Manuguru: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గోపిరామ్ ఎంపిక

Manuguru: సంగారెడ్డిలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన మణుగూరు శ్రీవిజ్ఞాన్ స్కూల్ విద్యార్థి గోపిరామ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Nov 2026 8:24 PM IST
Manuguru
X

Manuguru: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గోపిరామ్ ఎంపిక

మణుగూరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్‌ఐ (School Games Federation of India – SGFI) క్రీడా పోటీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఈరోజు నిర్వహించిన వాలీబాల్ ఫైనల్ పోటీలలో ఖమ్మం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన శ్రీవిజ్ఞాన్ స్కూల్ విద్యార్థి గోపిరామ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ ఘనతతో మణుగూరు ప్రాంతానికి telangana rastra స్థాయిలో గుర్తింపు తీసుకురావడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ, కొత్తమల్లేపల్లి గ్రామానికి చెందిన గోపిరామ్ పాఠశాల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. విద్యార్థి తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకొని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి, మణుగూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గోపిరామ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.

ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల పీఈటీ కృష్ణమూర్తి, ఇన్‌చార్జిలు దుర్గాదేవి, రజిత, ధనలక్ష్మి, విజయ్‌కుమార్, కొమరయ్య సార్, ఉపాధ్యాయులు మరియు గోపిరామ్ సహచర విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA