Manuguru: అర్ధరాత్రి సింగరేణి గని వద్ద భారి కొండ చిలువ.. భయం తో వనికిపోయిన కార్మికులు
Manuguru: మణుగూరు సింగరేణి ఓసీ-4 గని వద్ద భారీ కొండచిలువ కలకలం. మోటార్ల వద్ద సంచరిస్తున్న పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్.
Manuguru: అర్ధరాత్రి సింగరేణి గని వద్ద భారి కొండ చిలువ.. భయం తో వనికిపోయిన కార్మికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులోని సింగరేణి ఓసీ-4 గనుల వద్ద వద్ద ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. భారీ శబ్దాలతో రాత్రి సంచరించడంతో స్థానికులు, కార్మికులు భయాందోళన చెందారు. ఓసి ఫోర్ గని లోని నీటిని పంపించేసే మోటర్ల వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఓ భారీ కొండచిలువ సంచరించడం చూసిన కార్మికులు భయాందోళనకు గురయ్యారు.
రాత్రి వేళ నీటిని పంపించే మోటార్ల సమీపంలో గోల్డ్ కలర్‌లో మెరిసిపోతూ కనిపించిన ఈ రాక్ పైతాన్‌ను గమనించిన కార్మికులు వెంటనే స్నేక్ క్యాచర్ ముజాఫర్‌కు సమాచారం అందించారు. అతడు చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని రేగులగండి రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలిపెట్టాడు.
ముజాఫర్ మాట్లాడుతూ ఇది రాక్ పైతాన్ అనే జాతికి చెందిన కొండచిలువ అని తెలిపారు. పాములు విష సర్పాలైన మనుషులని ఏమీ చేయవని, అనవసరంగా వాటికి హాని తలపెట్టవద్దని, పాములు, కొండచిలువ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.




