Bhadradri: తాళ్లగొమ్మూరులో కొండచిలువ కలకలం: అడవిలోకి తరలింపు!

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది.

G Ravi, Bhadradri
Published on: 10 Aug 2026 11:46 PM IST
Bhadradri
X

Bhadradri: తాళ్లగొమ్మూరులో కొండచిలువ కలకలం: అడవిలోకి తరలింపు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరు పంచాయతీలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. గ్రామ పరిసరాల్లో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

కొండచిలువను గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ స్నాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ స్నాచర్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా అడవిలో వదిలేశారు.

కొండచిలువను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు సందడి నెలకొంది. స్నేక్ స్నాచర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story