Kothagudem: కొత్తగూడెంలో కెమిస్ట్స్ అసోసియేషన్ నిరసన బంద్ పోస్టర్ ఆవిష్కరణ

Kothagudem: దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను కొత్తగూడెంలో జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆవిష్కరించింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 May 2026 5:17 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో కెమిస్ట్స్ అసోసియేషన్ నిరసన బంద్ పోస్టర్ ఆవిష్కరణ

కొత్తగూడెం జిల్లా: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 20న దేశ వ్యాప్తంగా ఒక రోజు మెడికల్ షాపుల బంద్ పోస్టర్ ఆవిష్కరణ ఆన్లైన్ మందుల విక్రయాలను ఆపాలి, కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్లను రద్దు చేయాలి, నకిలీ ప్రమాదకరమైన మందులను అరికట్టాలని కోరుతూ.. కొత్తగూడెం లోని కెమిస్ట్ భవన్ లో జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.తిరుపతిరెడ్డి కంభంపాటి రవి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 20న మెడికల్ షాప్ ల ఒకరోజు బందు ..వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరెడ్డి కంభంపాటి రవిలు మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీ వలన మందుల అమ్మకాలపై నియంత్రణ ఉండదని తెలిపారు. నకిలీ ,మత్తు కలిగించే మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని, యువతకు ఇలా తేలికగా కలిగించే మందులు దొరకటం వల్ల వారి భవిష్యత్తుకు ప్రమాదకరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ పై నియంత్రణ లేకపోవడం విచారకరమన్నారు.

ఆన్ లైన్ ఫార్మసీల ద్వారా మందుల విక్రయాలను ఆపాలి, కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న విపరీత డిస్కౌంట్ విధానాల వల్ల దేశ వ్యాప్తంగా 13 లక్షల మందుల షాపుల మునగడకు ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల మందుల షాపుల భవిష్యత్తుకు ప్రమాదం జరుగుతుందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా కెమిస్ట్స్ స్ట్రైక్ మద్దతుగా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలో మే 20న మెడికల్ షాప్ ల ఒకరోజు బందు చేపట్టనున్నట్లు తెలిపారు.

అక్రమ ఈ-ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఉంటుందన్నారు. భౌతిక దృవీకరణ లేకుండా మందుల విక్రయం జరగడం వల్ల ఒకే ప్రిస్కిప్షన్ ను పలుమార్లు ఉపయోగించే అవకాశం పెరుగుతోందని వివరించారు. పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్ల ద్వారా మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని, అవసరమైన ఔషధాలపై ప్రభుత్వమే‌ లాభసాటి మార్జిన్లు నిర్ణయించినప్పటికీ, భారీ తగ్గింపులు ఇస్తుంటే చిన్న కెమిస్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. దీంతో గ్రామీణ మరియు పట్టణ, ప్రాంతాల్లో ఉన్న చిన్న మెడికల్ షాపుల మనుగడ ప్రమాదంలో పడుతుందని, చివరికి ప్రజలకు అందుబాటులో ఉండే ఔషధ సరఫరా వ్యవస్థనే దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కోవిడ్-19 సమయంలో 2020 మార్చి 26న జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ ను ఇప్పటికీ కొనసాగించడం సమంజసం కాదన్నారు. ఈ నిబంధన వల్ల డ్రగ్ రూల్ లోని కఠిన నిబంధనలు బలహీనపడుతున్నాయని, డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స ఈ అవకాశాన్ని వినియోగించుకుని నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే ఆన్ లైన్ ఫార్మసీలు, కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న విపరీతమైన డిస్కౌంట్ విధానాలను ఆపాలని

కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ ను వెంటనే ఉపసంహరించాలని, కార్పొరేట్ సంస్థల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు "లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్' విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ షాప్ ల ఒకరోజు బందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ కోశాధికారి లక్ష్మణా చారి, అధ్యక్షుడు అనిల్, సెక్రటరీ వెంకటేశ్వర్లు BCM అధ్యక్షుడు సోమ శేఖర్, సెక్రటరీ నాగేశ్వరరావు, జోగారావు,మురళీమోహన్,శ్రీనివాసరెడ్డి,రాఘవాచారి, లక్ష్మణ్ రావు, ఉమా మహేశ్వర రావు, మేదరమెట్ల శ్రీనివాస్ పలువురు కెమిస్ట్ లు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story