Kothagudem: కొత్తగూడెంలో 32 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి సుడిగాలి పర్యటన. 32 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్న మంత్రి.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 19 July 2026 7:06 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో 32 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం,మణుగూరు మండలాల్లో సమాచార ,రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి 32 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశారు.పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ఆశ్రమ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ఉన్నత విద్యను అందిస్తున్నామన్నారు.ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

ఈ సందర్భంగా : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమన్నారు,ప్రజల దీవెనలతో ఎన్నికైన ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాడికి అండ దండలు, భరోసా , బాధ్యతలు అందిస్తుందన్నారు పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య చదవాలనే లక్ష్యం తోటే ఆశ్రమ పాఠశాలలో ప్రైవేటు విద్యకు దీటుగా ఉన్నత విద్యను అందిస్తున్నామన్నారు, ప్రతి పేదింటి ఆడపడుచులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతోటే మీ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

భద్రాచ లం,పినపాక నియోజకవర్గంలో మొదటి విడతలో అదనంగా వేయిండ్లు మంజూరు చేసి నిర్మించామన్నారు.10 సంవత్సరాలు పరిపాలించిన పాలకులు కనీసం పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలనే సోయి లేకుండా పోయిందన్నారు.పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తుంటే ఓర్వలేక ప్రజా ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారన్నారు.

కాలేశ్వరం పై ఉన్న శ్రద్ధ కమీషన్ల కోసం కక్కుర్తి పడిన గత ప్రభుత్వం పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు.ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకు గిరిజనేతరులకు పోడు భూములతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని చిత్తశుద్ధితో అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తెలిపారు..

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA

Next Story