Sathupally: బేతుపల్లి ప్రమాదంపై స్పందించిన మంత్రి పొంగులేటి ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితం!

Sathupally: సత్తుపల్లి బేతుపల్లి చెరువు వద్ద బోటు ప్రమాదానికి గురైన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం పర్యవేక్షించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Nov 2026 7:53 AM IST
Sathupally
X

Sathupally: బేతుపల్లి ప్రమాదంపై స్పందించిన మంత్రి పొంగులేటి ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితం!

Sathupally: సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం బోటు తిరగబడిన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు గల్లంతైన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమీప ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాయి. వారిని మరో గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన రక్షణ పరికరాలు, బోట్లు అందుబాటులో ఉంచడంతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సహాయక చర్యల పురోగతిని జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు గురువారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.