Kothagudem: గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమం మంత్రి

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 19 July 2026 9:51 PM IST
Kothagudem
X

Kothagudem: గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమం మంత్రి

కొత్తగూడెం: కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ లో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ల పైలాన్ ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆవిష్కరించారు‌.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని ఎక్కడా కుంటు పడనీయకుండా, పేదవాడి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి తలంచి

రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే కొత్తగూడెం పట్టణంలో,కార్పొరేషన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసాము, ఇప్పుడు చేస్తున్నాము భవిష్యత్తులో కూడా వందకు వందశాతం స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో కలిసి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండే ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోబోతున్నట్లు తెలిపారు.

ప్రజా దీవెనలతో ఉన్న ప్రజా ప్రభుత్వం నిరంతరం పేదోడికి మంచి చేయాలని, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని ఒడిదురుకులు ఉన్నా వాటన్నిటిని నిలదొక్కుకొని

పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎక్కడా లోపించొద్దనే సంకల్పంతో నిరంతరం పేద వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాంట్లో భాగంగానే పేదలకు రెండువందల యూనిట్ల ఉచిత విద్యుత్, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదింటిన ఆడబిడ్డలు తినాలని, ఆర్టీసీ బస్సుల్లో ఎంత దూరం ప్రయాణం చేసిన ఆడబిడ్డలకు

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, ఆనాటి ప్రభుత్వ పదేళ్లపాలనలో రేషన్ కార్డ్ లు ఇవ్వకపోతే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా,పేదవాళ్ళు చిన్న ఇల్లు కట్టుకోవాలని చిరకాల కోరిక ఉండేదని,

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ కోరిక తీరుద్దని పేదవాళ్లు ఎదురు చూశారని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈ ఎన్నికలు అయిపోగానే మీకు ఇళ్ళు ఇస్తామని పేపర్లలో టీవీల్లో అందమైన బొమ్మ ఇళ్ళు చూపించి.. మాయ మాటలతో అధికారంలోకి వచ్చారని తీవ్రంగా విమర్శించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. రెండో విడత రెండున్నర లక్షల కి వెళ్లి ఇచ్చామని, హైదరాబాదు పట్టణంలో అదనంగా మరో లక్ష ఇళ్ళు, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగాఎనిమిది లక్షల సాంక్షన్ చేసామన్నారు..

సుమారు లక్షన్నర ఇళ్లు పూర్తి చేసామని, మరో రెండు లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చి తీరుతామన్నారు రెండవ విడత తరువాత మరో రెండు విడతల్లో అర్హులందరికీ ఇండ్లు ఇచ్చి తీరుతామన్నారు.

ఏ కులం అని ,ఏ మతం అని పార్టీ అని అడగమని పేదలయి ఉంటే చాలు తప్పనిసరిగా ఇల్లు ఇచ్చి తీరుతామని, రాష్ట్రవ్యాప్తంగా ఇంటి కోసం ఎదురు చేసే నిరుపేద ఆడబిడ్డలందరికీ ఇళ్ళు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు, ఇది ఇందిరమ్మ రాజ్యం అన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు 72 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పేదల పిల్లలు హాస్టల్లో చదువుకునేందుకు 40 శాతం డైట్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. ఆడపిల్లలకు 200% కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

పేదలకు మంచి వైద్యం అందించేందుకు ఎక్కడ లోపు లేకుండా వేలాది కోట్ల రూపాయలను వైద్యానికి ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఇదంతా డబ్బు ఉండి చేయడంలేదని, తల తాకట్టు పెట్టి, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ, ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుతూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story