Kallur: సత్తుపల్లి, కల్లూరుల్లో రూ. 1.74 కోట్ల పనులకు శంకుస్థాపన!
Kallur: సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో రూ. 1.74 కోట్ల పనులకు శంకుస్థాపన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాగమయి శ్రీకారం.
Kallur: సత్తుపల్లి, కల్లూరుల్లో రూ. 1.74 కోట్ల పనులకు శంకుస్థాపన!
కల్లూరు: రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలోని పలు వార్డుల్లో అంతర్గత సి.సి. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీ, వార్డు నెం. 1 లో పబ్లిక్ హెల్త్ & మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో, టీయుఎఫ్ఐడీసీ నగరాభివృద్ధి నిధుల నుండి రూ. 50.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సి.సి. రోడ్లు, డ్రెయిన్ల, వార్డు నెం. 12 లో రూ. 40.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, డ్రెయిన్ల, వార్డు నెం. 14 లో రూ. 40.50 లక్షల వ్యయంతో చేపట్టే అంతర్గత సి.సి. రోడ్లు, డ్రెయిన్ల, కల్లూరు మున్సిపాలిటీ లోని వార్డు నెం. 17లో రూ. 44.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సి.సి. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తంగా రూ. 1.74 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణాల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పన తో పాటు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, మునిసిపల్ చైర్మన్లు, కమీషనర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




