Kothagudem: కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన
Kothagudem: రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Kothagudem: కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన
కొత్తగూడెం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
రామవరం నాగయ్య గడ్డ ఏరియాలో కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు మాజీద్ భార్య చనిపోగా.. మంత్రి పొంగులేటి వారి నివాసానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంజాబ్ గడ్డ ప్రాంతంలో ఎన్ టీవీ రిపోర్టర్ శివ కృష్ణ తండ్రి ఇటీవల చనిపోగా.. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు.
పాల్వంచ పట్టణంలోని నవభారత్ ప్రాంతంలో సివిల్ సప్లై డీటి అనంతుల లక్ష్మీనారాయణ ఇటీవల బలవన్మరణానికి పాల్పడగా.. వారి కుటుంబ సభ్యులను.. ఓదార్చి ధైర్యం చెప్పారు.
పాత పాల్వంచలో ఎన్ఎండిసి విశ్రాంత ఉద్యోగి లోగాని సత్యసాయి బాబు ఇటీవల మరణించగా.. మంత్రి పొంగులేటి వారి నివాసానికి వెళ్లి.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, సీనియర్ నాయకులు గోపాలరావు, ఆళ్ళ మురళి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




