Bhadrachalam: ఘనంగా భద్రాద్రి కా మహారాజ్ వినాయక పూజా కార్యక్రమాలు!
Bhadrachalam: భద్రాచలంలో భద్రాద్రి కా మహారాజ్ వినాయక మహోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రత్యేక పూజలు.
Bhadrachalam: ఘనంగా భద్రాద్రి కా మహారాజ్ వినాయక పూజా కార్యక్రమాలు!
Bhadrachalam: భద్రాద్రి కా మహారాజ్ వారి వినాయక మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు ఆయనతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ , భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు,పార్టీ నాయకులు కలిసి భద్రాద్రి కా మహారాజ్ వినాయకుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా భద్రాది కా మహారాజ్ కమిటీ సభ్యులు, అర్చకులు ముఖ్య అతిథులను వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం పలికి శాలవలతో సత్కరించారు. ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి భద్రాద్రి కా మహారాజ్ కమిటీ యువకులను మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో భద్రాచలం ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.




