Kothagudem: అశ్వాపురం పోడు భూముల వివాదంపై మంత్రి సీతక్క సీరియస్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో చోటుచేసుకున్న పోడు భూముల వివాద ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 July 2026 12:16 AM IST
Kothagudem
X

Kothagudem: అశ్వాపురం పోడు భూముల వివాదంపై మంత్రి సీతక్క సీరియస్!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదానికి సంబంధించి చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి సీతక్క ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కూడా చర్చించి పరిస్థితిని సమీక్షించారు.

స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణ పేరుతో అతిగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో అటవీ ఆధారిత ఆదివాసి గిరిజన కుటుంబాల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన స్థానికులకు చట్టబద్ధంగా హక్కులు కల్పిస్తోందన్నారు.

అదే సమయంలో కొత్తగా పోడు భూముల ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆదివాసి గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు అటవీ సంపద సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story