Vemsur: కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన: మంత్రి తుమ్మల!
Vemsur: వేంసూరు మండలం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలించారు.
Vemsur: కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన: మంత్రి తుమ్మల!
వేంసూరు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాజకీయ, సాగునీటి రంగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అనంతరం జరిగిన ప్రజా సభలో ఉద్వేగంగా మాట్లాడారు. తనను సిద్ధాంతపరంగా వ్యతిరేకించినా వ్యక్తిగతంగా ఎప్పుడూ వ్యతిరేకించని కొందరు నేతలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంతంలో వెంగళరావుని ఎలా పేరు సంపాదించారు ఆయనకు మించి పేరు సంపాదించాలనే తపన తనకు ఉందని తెలుపుతూ ఏ పార్టీ అని చూడకుండా ప్రజల అభివృద్ధి కోసమే తాను పనిచేశానని స్పష్టం చేశారు.
తమ్మిళేరు, కృష్ణానీళ్లతో పాటు నేడు శ్రీరామచంద్రుడి దయవల్ల గోదావరి జలాలు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నాయని మంత్రి తెలుపుతూ. రాబోయే కాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా బోర్లు పనిచేయకపోవచ్చని రిజర్వాయర్లలో నీళ్లు లేక కరెంటు ఉత్పత్తి తగ్గి కరెంట్ కొరత ఏర్పడవచ్చని అందుకే ఇంటికి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు
సత్తుపల్లి నియోజకవర్గంలో త్వరలో ప్రారంభం కానున్న పామాయిల్ ఫ్యాక్టరీ.లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలన్నీ స్థానికులకే కల్పిస్తామని భరోసా ఇస్తూ ఫుడ్ పార్క్ ద్వారా సుమారు 3000 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు తనకు రాజకీయ జన్మను ఇచ్చిన ఈ ప్రాంత ప్రజల కోసం, రైతుల సంక్షేమం కోసం తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అంకితం చేస్తానని మంత్రి తుమ్మల తెలిపారు.




