Sathupalli: సత్తుపల్లిలో ‘శస్ర హాస్పిటల్’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాకర్లపల్లి రోడ్డులో డాక్టర్ వినీష్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ‘శస్ర హాస్పిటల్’ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 21 Oct 2026 9:32 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో ‘శస్ర హాస్పిటల్’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

సత్తుపల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో డాక్టర్ వినీష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శస్ర హాస్పిటల్ భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన ఆసుపత్రి ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంత ప్రజలు ఖమ్మం హైదరాబాద్ విజయవాడ ప్రాంతాలకు పోకుండా సకాలంలోనే వైద్యం అందినందుకు స్థానిక వైద్యులకు సహకారాలు అందించాలని తక్కువ ఖర్చుతోనే వైద్యం సకాలంలో అందుతుందని ప్రజల కోరుతున్నారు. అనవసరమైన పరీక్షలు మందులు రాయవద్దని మన ప్రధాని మోడీ చెప్పినట్లుగా జనరిక్ మందులు ఇవ్వాలని తక్కువ ఖర్చుతోనే మందులు వస్తాయని చెప్పిన విషయాన్ని డాక్టర్లకు ప్రజలు గుర్తు చేస్తున్నారు.

అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తెలుగు ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.

నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవంతో సత్తుపల్లి ప్రాంతంలో వైద్య సేవలకు మరింత ప్రాధాన్యం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI