Kothagudem: కొత్తగూడెంలో మంత్రి తుమ్మల ఆత్మీయ సమ్మేళనం
Kothagudem: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని కొత్తగూడెంలో అభినందన వేడుక నిర్వహించారు.
Kothagudem: కొత్తగూడెంలో మంత్రి తుమ్మల ఆత్మీయ సమ్మేళనం
Kothagudem: విద్యా నగర్ పంచాయతీ NK నగర్ లోని కమ్మ కళ్యాణ మండపంలో కొత్తగూడెం కమ్మ సంఘం అధ్యక్షుడు బిక్క సాని నాగేశ్వరరావు అధ్యక్షతన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆత్మీయ వేడుక సమావేశం నిర్వహించారు.
ఆత్మీయ వేడుక సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ గణేష్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతారాములు మోత్కూరి ధర్మారావు మాజీ జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, జె బి పి పార్టీ నాయకులు ఎర్ర కామేష్, మాజీ ప్రజాప్రతినిధులు.. విద్యా సంస్థల అధినేతలు పట్టణ ప్రముఖులు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా తుమ్మల నాగేశ్వరరావు ఉండటం చాలా అరుదైన అంశంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలోనే అవినీతి రహిత ఆదర్శ నేతగా తుమ్మల నాగేశ్వరరావు చెరగని ముద్ర వేశారన్నారు.
అభివృద్ధి సంక్షేమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మారుపేరుగా నిలుస్తారని.. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరావు చేసిన కృషి మరువలేనిదన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో
తాను చేపట్టిన ఏ మంత్రిత్వ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు తోడ్పాటు ఎంతో ఉందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మంత్రి తుమ్మల ఆలోచనే అన్నారు.
డాక్టర్ మనోహర్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా కలెక్టరేట్, కిన్నెరసాని మంచినీటి పథకం, భద్రాచలంలో కరకట్ట నిర్మాణంలో మంత్రి తుమ్మల కృషి ఉందన్నారు. వామపక్ష పార్టీలకు తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యత ఇచ్చేవారని, వామపక్ష పార్టీలతో పొత్తు ధర్మానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన నేత తుమ్మల నాగేశ్వరరావు అని కొనియాడారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో ఉండాలని,మున్ముందు రాష్ట్ర అభివృద్ధికి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.




