Dummugudem: దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాల పనులను పరిశీలించనున్న తుమ్మల!
Dummugudem: పినపాక నియోజకవర్గం అమ్మగారిపల్లె వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట ఇసుక బస్తాల పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉదయం 11 గంటలకు పరిశీలించనున్నారు.
Dummugudem: దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాల పనులను పరిశీలించనున్న తుమ్మల!
దుమ్ముగూడెం: రేపు(ఆదివారం) అమ్మగారి పల్లెకు మంత్రి తుమ్మల గారు, ఉదయం 11 గంటలకు పినపాక నియోజకవర్గం పరిధిలోని అమ్మగారిపల్లె కు రానున్నారు. అక్కడ గోదావరి నీటిని ఒడిసిపెట్టేందుకు ఆ నీటిని మూడు జిల్లాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల గారు దుమ్ముగూడెం వద్ద ఇసుక బస్తాల వేసే పనులను మంత్రి తుమ్మల గారు పరిశీలించనున్నారు.
ఇప్పటికే దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిని ఒడిసిపెట్టేందుకు పనులను గతంలో రెండుసార్లు పరిశీలించి ఆ పనులను వేగవంతం చేసిన మంత్రి తుమ్మల గారు రేపు మరోసారి ఉదయం 11 గంటలకు దుమ్ముగూడేనికి వెళ్లనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల గారితో పాటు స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదులశాఖ అధికారులు పాల్గొంటారు.




