Sattupalli: పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన.. రేపు మంత్రి పర్యటన!
Sattupalli: ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ పనులను రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించనున్నారు.
Sattupalli: పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన.. రేపు మంత్రి పర్యటన!
సత్తుపల్లి: నియోజకవర్గ పరిధిలోని వెంసూరు మండల పరిధిలోని కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సందర్శించనున్నారు.
ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీగా శేరవేగంగా నిర్మాణం జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల పరిశీలించనున్నారు.
గత సంవత్సరం ఉగాది రోజున శంకుస్థాపన చేయబడిన ఈ ఫ్యాక్టరీ నిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయి.ఈ ఫ్యాక్టరీ ని అతి త్వరలో ప్రారంభించి ఖమ్మం జిల్లా పామాయిల్ రైతులుకు అందించాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల ఉన్నారు.
ఈ కల్లూరుగూడెం ఫ్యాక్టరీ ప్రారంభమైతే వేంసూరు సత్తుపల్లి పెనుపల్లి తల్లాడ వైరా కల్లూరు మండల పామాయిల్ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం మూడు గంటలకు మంత్రి తుమ్మల కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించనున్నారు.




