Annapureddypalli: టెన్త్ టాపర్లకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సన్మానం..

annapureddypalli: అన్నపురెడ్డిపల్లిలో ఇంపాక్ట్, తొలిఅడుగు ఫౌండేషన్ల ఆధ్వర్యంలో టెన్త్ మెరిట్ విద్యార్థుల అభినందన సభ జరిగింది.

SK MAHABOOB JANI, JULURPADU
Updated on: 5 Jun 2026 5:43 PM IST
annapureddypalli
X

annapureddypalli: టెన్త్ టాపర్లకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సన్మానం..

అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఇంపాక్ట్ మరియు తొలిఅడుగు ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి చంద్రుగొండ మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలలో ఇటీవల నిర్వహించిన పదవతరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక అభినందన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా సరైన లక్ష్యంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు విద్యార్థులు పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసి జ్ఞాపికలు మరియు ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్సా వెంకట్ గారు, సీనియర్ నాయకులు బానోత్ భీముడు గారు, ఇంపాక్ట్, తొలి అడుగు ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story