Annapureddypally: అన్నపురెడ్డిపల్లి ప్రత్యేక గ్రామసభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె!
Annapureddypally: అన్నపురెడ్డిపల్లి గాంధీ జయంతి వేడుకలు మరియు ప్రత్యేక గ్రామసభల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు.
Annapureddypally: అన్నపురెడ్డిపల్లి ప్రత్యేక గ్రామసభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె!
Annapureddypally: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంతో పాటు మర్రిగూడెం పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన విబిజి రామ్ జి ప్రత్యేక గ్రామసభల్లో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని గ్రామ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు గ్రామపంచాయతీల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాలని ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తమ విధుల పట్ల ఎలాంటి అలసత్వం నిర్లక్ష్యం చూపకుండా ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు గ్రామపంచాయతీకి సర్పంచ్ ప్రథమ పౌరుడిగా గ్రామ అభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలని స్వలాభాలకు రాజకీయ ప్రయోజనాలకు పదవులను ఉపయోగించుకోకుండా ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు గ్రామపంచాయతీ సమావేశాల్లో తీర్మానించిన ముఖ్యమైన అభివృద్ధి పనులను ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాలని గ్రామ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరికీ తెలియజేయాలని సూచించారు.
ప్రతి గ్రామపంచాయతీకి అవసరమైన వార్షిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికలకు అనుగుణంగా అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన సహకారాన్ని తన వంతుగా ఎప్పటికప్పుడు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్సా వెంకటేశ్వరావు గారు, భానోత్ భీముడు గారు, వేముల రమణారావు గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేముల నరేష్ గారు, ఎమ్మార్వో స్వర్ణ గారు, సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




