Palvancha: యోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కొత్తగూడెం ఎమ్మెల్యే!
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
Palvancha: యోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కొత్తగూడెం ఎమ్మెల్యే!
పాల్వంచ: పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో బుధవారం రూ.1.73 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపనల సభల్లో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 31, 33, 34, 36, 38, 42, 45 డివిజన్లలో ఈ నిధులతో మొత్తం 10 అభివృద్ధి, నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజలకు అత్యంత అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అందులో భాగంగానే ఈ నిధులను మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు.
పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు డ్రైన్ల నిర్మాణంతో పాటు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు సిమెంట్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా ఈ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాపక్షం నిలిచే ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, పాల్వంచ పట్టణ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేషన్ కమిషనర్ కె సుజాత, తహసిల్దార్ దారా ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏ డి ఈ అబ్దుల్ రెహమాన్, డిప్యూటీ కమిషనర్ విజయానంద్, టౌన్ ఎస్సై తోట నాగరాజు, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, నామ కీర్తి, నూనావత్ శ్యామల, గొర్లె అన్నపూర్ణ, సింధు తపస్వి, సుగుణ, నరేష్, మధుచంద్, విజయలక్ష్మి, సీపీఐ నాయకులు శనగారపు శ్రీనివాసరావు, గౌతమి కృష్ణ, శేఖర్ బాబు, ys గిరి, నాగమణి, SA రెహమాన్, ఆలపాటి ప్రసాద్, కరీం, కాకటి రవీందర్, దినేష్, నరేష్, నవీన్, అంజాద్, రామాచారి, బట్టు హరి, చరప శ్రీను, లక్ష్మీ, రాజేశ్వరరావు, జిలానీ, భీమనాయక్, ఆదినారాయణ, అశోక్, వివిధ శాఖల డిఇలు, ఏఈలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




