Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా విజయదశమి వేడుకలు, రావణ వధ కార్యక్రమం!

Kothagudem: కొత్తగూడెం సింగరేణి కార్మిక ప్రాంతంలో రైటర్ బస్తీ, రామవరంలో ఘనంగా జరిగిన విజయదశమి వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 21 Oct 2026 6:27 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా విజయదశమి వేడుకలు, రావణ వధ కార్యక్రమం!

Kothagudem: రైటర్ బస్తీ, రామవరంలో జరిగిన జమ్మి పూజ, రావణ వధ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని కోరారు. ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM