Palwancha: పాల్వంచలో దీపావళి షాపులు ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
Palwancha: పాల్వంచలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా దుకాణాలను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించి నిర్వాహకులకు భద్రతా సూచనలు చేశారు.
Palwancha: పాల్వంచలో దీపావళి షాపులు ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ: పట్టణంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి దుకాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగ సందర్భంగా వ్యాపారాలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాణాసంచా దుకాణాల నిర్వాహకులు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బాణాసంచా నిల్వ, విక్రయాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దుకాణాల నిర్వాహకులు, వ్యాపారులు పాల్గొన్నారు.




