Kothagudem: కొత్తగూడెంలో సీపీఐ భారీ ధర్నా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కూనంనేని గర్జన!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 10 Jun 2026 3:29 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో సీపీఐ భారీ ధర్నా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కూనంనేని గర్జన!

భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ (CPI) పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతోందని, ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story