Burgampadu: బూర్గంపాడులో ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Burgampadu: బూర్గంపాడు రైతు వేదికలో టేకుల చెరువు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

G Ravi, Bhadradri
Published on: 9 Nov 2026 7:41 PM IST
Burgampadu
X

Burgampadu: బూర్గంపాడులో ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

బూర్గంపాడు: బూర్గంపాడు మండల కేంద్రంలోని రైతు వేదిక నందు టేకుల చెరువు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలు, కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

అదేవిధంగా ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. పేద కుటుంబాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, MRO, హౌసింగ్ ఏఈ, మండల అధ్యక్షులు పి. సుధాకర్ రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri