Burgampahad: జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన హౌసింగ్ శాఖ ఏఈకి ఘన సత్కారం
Burgampahad: గృహ నిర్మాణ ప్రగతిలో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన బూర్గంపహాడ్ హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్‌ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు.
Burgampahad: జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన హౌసింగ్ శాఖ ఏఈకి ఘన సత్కారం
బూర్గంపహాడ్: జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో ప్రథమ స్థానం సాధించిన మండల హౌసింగ్ శాఖ ఏఈ పొడిచేటి ఉదయ్ కిరణ్ ని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఘనంగా అభినందించారు. మండలంలో 675 ఇళ్లు మంజూరు కాగా, 625 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, 450 ఇళ్లను పూర్తి చేసినందుకు ఏఈ ఉదయ్ కిరణ్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో హౌసింగ్ శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రథమ స్థానం సాధించడం మండలానికి గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఏఈ ఉదయ్ కిరణ్ సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జములా రెడ్డి, తాసిల్దార్ కేఆర్ కే ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వారాల వేణు,సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, నియోజకవర్గ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




