Burgampahad: లక్ష్మీపురంలో వెన్నెల జ్యోతి మహిళా సంఘం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే!

Burgampahad: బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో రూ.10 లక్షలతో నిర్మించిన వెన్నెల జ్యోతి మహిళా సంఘం భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

G Ravi, Bhadradri
Published on: 26 Oct 2026 1:46 PM IST
Burgampahad
X

Burgampahad: లక్ష్మీపురంలో వెన్నెల జ్యోతి మహిళా సంఘం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే!

Burgampahad: భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మి పురం గ్రామపంచాయతీ లో భద్రాచలం డివిజన్ పరిధి లో మొదటగా నిర్మాణం పూర్తి చేసుకున్న వెన్నెల జోతి (SHG/VO ఫెడరేషన్ బిల్డింగ్ )మహిళా సంఘమ్ భవనము నుపినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభం చేశారు.

10 లక్షల రూపాయల నిధులతో వెన్నెల జ్యోతి గ్రామ సంఘ భవనం నిర్మాణం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ భవనం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న, సమస్యలున్న నా దృష్టికి తీసుకురండి సమస్య పరిష్కారం చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం స్మార్ట్ కార్డు ప్రోగ్రాం లో పాల్గొని పంపిణీ చేశారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri