Sathupalli: బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రాగమయి, దాసరి కుటుంబం
Sathupalli: సత్తుపల్లి మండలంలోని గంగారం, పాకలగూడెం, రామగోవిందాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, దాసరి కుటుంబ సభ్యులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
Sathupalli: బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రాగమయి, దాసరి కుటుంబం
సత్తుపల్లి: బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యేతో కలిసి సందడి దసరా పండుగ సందర్భంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లోనూ గ్రామ ప్రజలతో కలిసి పాల్గొంటూ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. సత్తుపల్లి మండలంలోని గంగారం, పాకలగూడెం, రామగోవిందాపురం గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ దాసరి రెడ్డి పాల్గొన్నారు. మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో గ్రామీణ మహిళల ఉత్సాహం, సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని ఈ కార్యక్రమాలు చాటిచెప్పాయి.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందడుగు
గ్రామాన్ని దత్తత తీసుకొని విద్య, రహదారులు, పాఠశాలల సదుపాయాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు సహకరించడం ద్వారా దాసరి వెంకటరామిరెడ్డి చిట్టినాయన కుమారుడు గ్రామాభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామ ప్రజల అవసరాలకు స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావడం అభినందనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం, సేవాభావం ఎంతో అవసరం. గంగారం గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తరించి, గ్రామం విద్య, మౌలిక వసతులు, సామాజిక ఐక్యతలో ఆదర్శంగా నిలవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.




