Bhadrachalam: దుమ్ముగూడెంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Bhadrachalam: దుమ్ముగూడెం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు.
Bhadrachalam: దుమ్ముగూడెంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Bhadrachalam: దుమ్ముగూడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల వివాహం చేసుకుని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల కుటుంబానికి మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు అధికారుల సమన్వయంతో లబ్ధిదారులకు అందజేశారు.
అలాగే అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




