Khammam: మాజీ ఎంపీపీ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రజాప్రతినిధులు
Khammam: ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్‌లో వైభవంగా మరిపెడ మాజీ ఎంపీపీ గుగులోత్ అరుణ-రాంబాబు నాయక్ కుమార్తె గ్రీష్మిక వివాహం. పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.
Khammam: మాజీ ఎంపీపీ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రజాప్రతినిధులు
ఖమ్మం: ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మరిపెడ మాజీ ఎంపీపీ గుగులోత్ అరుణ–రాంబాబు నాయక్ దంపతుల కుమార్తె గ్రీష్మిక–సంజయ్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ గారి సతీమణి డాక్టర్ ప్రమీల , పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరై నూతన వధూవరులు గ్రీష్మిక–సంజయ్‌లను కలిసి ఆశీర్వదించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధుమిత్రులు, అభిమానులు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




