Kothagudem: జిల్లాలో కురిసిన మోస్తరు వాన.. ఊపిరి పీల్చుకున్న అన్నదాతలు
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది.
Kothagudem: జిల్లాలో కురిసిన మోస్తరు వాన.. ఊపిరి పీల్చుకున్న అన్నదాతలు
కొత్తగూడెం: జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయన్న తెలంగాణ వాతావరణ సూచన నేపథ్యంలో కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి మోస్తారు వర్షం కురిసింది.జూలై 21 నుండి 28 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలతో కొత్తగూడెం పరిసర ప్రాంత గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత 20 రోజులుగా వాన జాడ లేని నేపథ్యంలో వరి, పత్తి తదితర పంట మొక్కలు ఎండిపోతున్న దశలో.వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న, అన్నదాతలకు ఈ వర్షం హర్షాన్ని కలిగించింది.ఈ సందర్భంగా ఆదర్శ రైతు గొట్టిపాటి వెంకటేశ్వరరావు, తాండ్ర కృష్ణార్జున రావు తదితర రైతులు మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావం కారణంగా వర్షాలు లేక బోరు బావుల్లో నీళ్లు అడుగంటి పోవటంతో ఎంతో ఆందోళనగా ఉన్నామని, గత మూడు వారాలుగా వర్షాలు లేక అల్లాడుతున్నామని,వాతావరణ శాఖ ఒక వారం పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచనచేసిందని,
నేడు మద్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన మోస్తారు వర్షం మొక్కలకే కాదు రైతులకు ప్రాణదానం లాంటి వర్షం అంటూ హర్షం వ్యక్తం చేశారు.పొలాలలో పని చేస్తున్న తాము వర్షంలోనే తడుచుకుంటూ ఉన్నామని ఈ వర్షం మాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.వరి,పత్తి ,అన్ని పంటలకు వర్షం ఎంతో శ్రేష్టమైనది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.




