Kothagudem: మొరంపల్లి బంజారా సంతలో అక్రమ తరలింపులతో భారీగా నష్టం!

Kothagudem: మొరంపల్లి బంజారా సంతలో నిబంధనలకు విరుద్ధంగా ఆవులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల సంత పాటదారుడికి, గ్రామ పంచాయతీకి ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

G Ravi, Bhadradri
Published on: 5 Nov 2026 4:34 PM IST
Kothagudem
X

Kothagudem: మొరంపల్లి బంజారా సంతలో అక్రమ తరలింపులతో భారీగా నష్టం!

Kothagudem: మొరంపల్లి బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న బంజారా సంత పేరుకే మొరంపల్లి బంజారా సంతగా కొనసాగుతోందని, వాస్తవానికి ముసలిమడుగు గ్రామం మరియు ఎం పి బంజర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆవులను తరలిస్తున్నారని సంత పాటదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మొరంపల్లి బంజారా సంత నిర్వహణకు వేలంపాట ద్వారా సుమారు 35 లక్షల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి ఆవులను తరలించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల సంత పాటదారుడికి, గ్రామ పంచాయతీకి ఆర్థికంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.

ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో బంజారా సంత పాటకు విలువ తగ్గి, వేలంపాటలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం నేరుగా గ్రామ పంచాయతీ ఆదాయంపై పడే అవకాశం ఉందన్నారు.

కావున బంజారా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి నష్టం కలగకుండా సంత నిర్వహణపై పర్యవేక్షణ పెంచి, నిబంధనల ప్రకారం సంత కొనసాగించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామస్తులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. తద్వారా గ్రామ పంచాయతీ ఆదాయాన్ని కాపాడటంతో పాటు గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడిన వారవుతారని తెలియజేస్తున్నాము.

ఇట్లు,

సంత పాటదారుడు

మొరంపల్లి బంజర్,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri