Khammam: హైదరాబాద్‌కు చేరుకున్న ఖమ్మం యువతి అక్షిత పార్థివ దేహం!
Khammam: అమెరికాలో మృతి చెందిన ఖమ్మం యువతి నల్లమల అక్షిత పార్థివ దేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. నేడు ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Khammam: హైదరాబాద్‌కు చేరుకున్న ఖమ్మం యువతి అక్షిత పార్థివ దేహం!
Khammam: అమెరికాలో గత 23 వ తేదీన ఆకస్మికంగా మృతి చెందిన ఖమ్మం నగరానికి చెందిన నల్లమల ఆనంద్,కల్పన ల కుమార్తె అక్షిత పార్థివ దేహం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకుంది.
అమెరికా నుండి వచ్చిన కుమారి నల్లమల అక్షిత పార్థివ దేహాన్ని ఖమ్మం కు తరలించే ఏర్పాట్లును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ పర్యవేక్షించారు. నేడు ఖమ్మం లో నల్లమల అక్షిత అంత్యక్రియలు జరిపెందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమెరికా లో ఎమ్ ఎస్ చదివేందుకు వెళ్లిన అక్షిత ఆకాల మరణంతో ఖమ్మం నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిన అక్షిత చదువు అయిపోయి జాబ్ చేసే సమయంలో మృతి చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు పలువురు మంత్రులు రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలు సానుభూతి తెలియజేసారు.




