Khammam: కాంగ్రెస్ నేత జావీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ నేత మహమ్మద్ జావీద్ కుటుంబ సభ్యులను ఎంపీ రఘురాం రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
Khammam
Khammam: ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావీద్ కుటుంబ సభ్యులను ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి పరామర్శించారు.
శుక్రవారం జావీద్ నివాసానికి చేరుకున్న ఎంపీ రఘురాం రెడ్డి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జావీద్ కుమార్తెలు షెహలా జావీద్, మదిహలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మహమ్మద్ జావీద్‌తో తనకు ఎంతోకాలంగా వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలోనూ పార్టీ కోసం కృషి చేసిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు.
పార్టీ బలోపేతానికి జావీద్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం పార్టీకి, నగరానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జావీద్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి, డీసీసీ సెక్రటరీ ముక్రం అలీ ఖాన్, నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.




