Khammam: లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలి: ఎంపీ రవిచంద్ర

Khammam: పాల్వంచ హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని మంత్రి ఉత్తమ్‌తో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడి బాధితులకు అండగా నిలిచారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 31 Oct 2026 3:06 PM IST
Khammam
X

Khammam: లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలి: ఎంపీ రవిచంద్ర

ఖమ్మం: కొంతమంది బ్లాక్మెయిల్ వేధింపుల కారణంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పాల్వంచ హెచ్.పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి న్యాయం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ కలిశారు. ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లై) మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డితో మాట్లాడారు. అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి తప్పనిసరిగా సివిల్ సప్లై శాఖ నుండి న్యాయం జరిగే విధంగా చూడాలని అదేవిధంగా స్థలం, ఇంటితో పాటు ఆర్థిక సహాయాన్ని సైతం అందజేయాలని డిజిపి కి చెప్పి నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ తో సైతం మాట్లాడి సహాయం చేసే విధంగా చూస్తానని అన్నారు.

ఎంపీ వద్దిరాజును కలిసిన వారిలో కొత్తగూడెం పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు పుట్ట శంకరయ్య, వేముల మనోహర్ రావు, వేముల ప్రసాద్ బాబు, మాచర్ల శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, కేదాసి నవీన్, వేముల మధుకర్, మాటేటి అశోక్, వేముల సతీష్ , సాయరి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.