Mulakalapalli: గుట్టుగూడెంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ చిన్నరాములు

Mulakalapalli: ములకలపల్లి మండలం గుట్టుగూడెంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వాడే చిన్నరాములు. సంక్షేమ పథకాల అందజేత.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 7 Nov 2026 11:37 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: గుట్టుగూడెంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ చిన్నరాములు

ములకలపల్లి: గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని గుట్టుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ వాడే చిన్నరాములు అన్నారు. మండల పరిధిలోని గుట్టుగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన ఆహార భద్రతా కార్డులను (రేషన్ కార్డులు) లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చిన్నరాములు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డులు కీలకమన్నారు. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి కూడా కార్డులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్లు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN