Mulakalapalli: ములకలపల్లి మండలంలో ముమ్మరంగా సీసీ రోడ్ల నిర్మాణం!

Mulakalapalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాళ్లపాయిలో ఎమ్మెల్యే ఆదినారాయణ సహకారంతో CC రోడ్డు పనులకు సర్పంచ్ శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధే ధ్యేయమన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 25 Oct 2026 2:04 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: ములకలపల్లి మండలంలో ముమ్మరంగా సీసీ రోడ్ల నిర్మాణం!

Mulakalapalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం స్థానిక సర్పంచ్ గడ్డం సుజాత–ఉదయ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మంగళగుట్ట, సుందర్‌నగర్, తాళ్లపాయి గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. విడతలవారీగా పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండ్రు అనూష, వార్డు సభ్యుడు కనితి బుల్లిబాబు, గ్రామ పెద్దలు మడకం కేసీఆర్, కొండ్రు అంజన్‌రావు, కొండ్రు మహేష్, కాంగ్రెస్ నాయకులు వొగ్గేలా వీరస్వామి, కీసరి రాజ్‌కుమార్, కొండ్రు రాజ్‌కుమార్, రవ్వ ప్రేమ్‌కుమార్, కీసరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN