Kothagudem: ఆదివాసీ యువతి శిరీష మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి!

Kothagudem: ములకలపల్లికి చెందిన నర్స్ శిరీష మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Sept 2026 8:53 AM IST
Kothagudem
X

Kothagudem: ఆదివాసీ యువతి శిరీష మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి!

Kothagudem: ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే శీరీష మృతిపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షులు గొంది వెంకటరమణ డిమాండ్ చేశారు. శీరీష మృతి ఘటనను ఆధార్ సొసైటీతో పాటు AEWCA, AMCS, ASF, ఆదివాసీ మహిళా, విద్యార్థి సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నర్సుగా సేవలందించిన శీరీష మృతి సమాజాన్ని కలచివేసిందని, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆదివాసీ యువతికి భద్రత లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. శీరీష మృతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైనా ఉల్లా ఖాన్‌పై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర దర్యాప్తు చేపట్టి, అన్ని ఆధారాలను సేకరించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదివాసీ సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు. మహిళలు, ముఖ్యంగా నర్సులు, రాత్రి వేళల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం పటిష్టమైన భద్రత కల్పించాలని గొంది వెంకటరమణ కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పూనెం. శ్రీనివాస్, లక్ష్మిదేవిపల్లి సర్పంచ్..తాటి. అనిత, తిరుమలేష్,AEWCA,జిల్లా అధ్యక్షులు, పోలేబోయిన. వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్స. లక్ష్మణ్, మలకం స్వామి, తోలెం. వెంకటేశ్వర్లు, పెండెకట్ల, రామనాధం,పూనెం. సమ్మయ్య,గొగ్గెల.నాగేశ్వరావు, కొమరం. పాపారావు,చీమల. అచ్చయ్య.తాటి. సూరయ్య.కుంజా. లక్ష్మి నారాయణ.ATF,అధ్యక్షులు పాయం. ఆనందరావు,ATA, అధ్యక్షులు. బీజ్జ. శ్రీను,తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు, తెల్లం. నర్సింహా రావు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story