Velugumatla: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్!

Velugumatla: వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతితో పాటు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పైప్‌లైన్ పనులను మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 3 Nov 2026 4:01 PM IST
Velugumatla
X

Velugumatla: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్!

Velugumatla: వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులతో పాటు, ఆయా కాలనీల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ గారు ఇంజనీరింగ్, ఇందిరమ్మ ఇళ్ల విభాగాల అధికారులతో కలిసి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని ఇళ్లకు గల కారణాలను తెలుసుకుని, లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

అనంతరం ఆయా కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా కాలనీల చుట్టూ ప్రహరీ నిర్మాణం, తాగునీటి సరఫరా కోసం చేపడుతున్న పైప్‌లైన్ . పనుల నాణ్యతను పరిశీలిస్తూ, నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

కాలనీల్లో నివసించే ప్రజలకు రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందేలా సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అన్ని పనులను సమన్వయంతో వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.