Sathupalli: రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు..ఎమ్మెల్యేకు ఆహ్వానం!

Sathupalli: సత్తుపల్లిలో జరగనున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే మట్టా రాగమయిని మువ్వా విజయబాబు ఆహ్వానించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 27 Oct 2026 12:36 PM IST
Sathupalli
X

Sathupalli: రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు..ఎమ్మెల్యేకు ఆహ్వానం!

Sathupalli: మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి జన్మదినం సందర్భంగా, ex.TGIDC చైర్మన్ శ్రీ మువ్వా విజయబాబు గారి ఆధ్వర్యంలో, మువ్వా యూత్ – సత్తుపల్లి వారి నిర్వహణలో జరుగుతున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారిని మువ్వా విజయబాబు గారు ఆహ్వానించారు.

మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహిస్తూ, రాష్ట్రస్థాయిలో కబడ్డీ క్రీడ అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు హాజరై క్రీడాకారిణులకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు.

తేదీలు: అక్టోబర్ 28, 29, 30, 2026

వేదిక: రాణి సెలబ్రేషన్స్, వేంసూరు రోడ్, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాది చెన్నారావు గారు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి గారి, మువ్వా మరియు మట్టా గారి అభిమానులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI