Kothagudem: క్యాన్సర్ బాధితుడికి నైనిష ఫౌండేషన్ ఆర్థిక సాయం!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన క్యాన్సర్ బాధితుడు బాసిక సంతోష్‌కు నైనిష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 14 Sept 2026 11:48 AM IST
Kothagudem
X

Kothagudem: క్యాన్సర్ బాధితుడికి నైనిష ఫౌండేషన్ ఆర్థిక సాయం!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోని శేషగిరి నగర్ కి చెందిన ,బాసిక సంతోష్ తండ్రి కొమ్మలు, అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు అతనిపరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది.తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో , దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. బాసిక సంతోష్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం..

అతని దయనీయ పరిస్థితిని తెలుసుకున్న నైనిష ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, బాసిక సంతోష్ కి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నైనిష ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండర్ మట్టపల్లి సాగర్ యాదవ్, జర్నలిస్ట్ పోదిల వీరబాబు, అడ్వకేట్ ఈర్ల రాము, జర్నలిస్ట్ మిట్టపల్లి గోపి, ఉప్పాడి అనిత మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA