Kothagudem: ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ (డి) మహాధర్నా.. రైతుల అజెండాతో పోరాటం
Kothagudem: జూన్ 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ (డి) ఆధ్వర్యంలో 'రైతు సింహ గర్జన'.
Kothagudem: ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ (డి) మహాధర్నా.. రైతుల అజెండాతో పోరాటం
కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి లోని టీఆర్ఎస్ (డి)పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ విలేకరుల సమావేశం..TRS ( D) పార్టీ ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సింహ గర్జనను జయప్రదం చేయాలని విజ్ఞప్తి..
రైతు సింహ గర్జన ముఖ్య ఉద్దేశం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రైతు మోటార్లపై అదనపు భారం వేయకూడదు. మక్కలను, వడ్లను కొనుగోలు చేయాలి.
పసుపు రైతులకు న్యాయం చేయాలి. కౌలుదారులకు కౌలు భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలి. రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 12 వేల రూపాయలు ఇవ్వాలని రైతుబంధు ప్రతి ఎకరాకు 15000 ఇవ్వాలన్నారు. రైతులకు గ్రామీణ బ్యాంకుల ద్వారా, సహకార పరపతి సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేయాలని డిమాండ్ చేసారు.
ప్రభుత్వమే నాణ్యమైన వ్యవసాయ విత్తనాలు, రసాయనిక క్రిమిసంహారక మందులను రైతులకు అందించాలని సూచించారు. ప్రతి మండలంలో గిడ్డంగి సౌకర్యాలను కల్పించాలి, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేవరకు గిడ్డంగిలో నిల్వ చేసుకునే ఉచిత సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.
రైతులు అప్పుల బారిన పడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తులకు తప్పనిసరిగా లైసెన్సింగ్ ఉండే విధానాన్ని అతి తక్కువ వడ్డీకి ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రైతు కుటుంబాలలో పెండ్లిండ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వమే వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలని సూచించారు.
కౌలు రైతులను ఆదుకోవాలి, పోడుదారులకు పట్టా భూములు ఇవ్వాలని, తడిసిపోయిన రైతు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.. రైతు సమస్యల సాధన కొరకు జూన్ 30వ తేదీన నిర్వహించనున్న రైతు సింహ గర్జనను విజయవంతం చేయాలని కోరారు.




