Khammam: ఖమ్మం సీపీ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవం

Khammam: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్, హెడ్ క్వార్టర్స్‌లో ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 31 Oct 2026 2:38 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం సీపీ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవం

ఖమ్మం: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వాటర్స్ లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రామానుజం,కుమారస్వామి, ఏసీపీలు సాంబరాజు నర్సింహారావు, ఏవో కళావతి, ఆర్ఐ కామరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాధ్, మినిస్ట్రీయల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.