Julurupadu: ఉపాధి పనులు పరిశీలన.. కూలీలకు చల్లటి మజ్జిగ పంపిణీ!

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో ఉపాధి హామీ పనులను ఏపీఓ, సర్పంచ్ నవీన్ గంగావత్ పరిశీలించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 23 May 2026 1:55 PM IST
Julurupadu
X

Julurupadu: ఉపాధి పనులు పరిశీలన.. కూలీలకు చల్లటి మజ్జిగ పంపిణీ!

జూలూరుపాడు: వినోభానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని) పనులను ఏ.పీ.ఓ గారు మరియు గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ గారు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

​ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటున్న నేపథ్యంలో, పనులకు వెళ్తున్న కూలీలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూలీలకు చల్లటి మజ్జిగ/మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు.

వినోభానగర్ నుండి ఉపాధి పనులకు ప్రతిరోజూ సుమారు 130 మంది కూలీలు హాజరవుతున్నారని, వారు ఎండ దెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏ.పీ.ఓ మరియు సర్పంచ్ గారు ఈ సందర్భంగా సూచించారు. ​ఈ మండుటెండల్లో తమ దాహార్తిని తీర్చడానికి గ్రామ పంచాయతీ తరపున సకాలంలో స్పందించి ఈ సదుపాయం కల్పించడం పట్ల ఉపాధి హామీ కూలీలు సర్పంచ్ గారికి మరియు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story