Nelakondapalli: కోరుట్లగూడెంలో ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి
Nelakondapalli: నేలకొండపల్లి కోరుట్లగూడెంలో ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 8 లక్షల ఇళ్లకు రూ.40 వేల కోట్లు కేటాయింపు.
Nelakondapalli: కోరుట్లగూడెంలో ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం కోరుట్లగూడెం గ్రామంలో మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుకలు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ , గ్రృహ నిర్మాణ శాఖ పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ టీయస్ దివాకర్ పోలీస్ కమీషనర్ సునీల్ ధత్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం, ఆత్మగౌరవమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఆదివారం నేలకొండపల్లి మండలం కోరుట్లగూడెం గ్రామంలో మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుకలు కార్యక్రమంలో మంత్రి, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని, పేదవాడి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు, రెండవ విడతలో 2.5 లక్షల ఇళ్లు, అదనంగా హైదరాబాదులో మరో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను 40 వేల కోట్ల రూపాయలతో నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు.
మొదటి విడత ఇచ్చిన ఇళ్లలో ఇప్పటికే సుమారు 2 లక్షల 21 వేల ఇళ్లు పైచిలుకు గృహ ప్రవేశాలు జరగగా, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండవ విడత ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ఫైనల్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా మూడో, నాలుగో విడతల్లో సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.




