Nelakondapalli: 19 గోవుల పట్టివేత.. నలుగురి అరెస్ట్, ఆరుగురిపై కేసు!
Nelakondapalli: నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 19 గోవులను పోలీసులు పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.
Nelakondapalli: 19 గోవుల పట్టివేత.. నలుగురి అరెస్ట్, ఆరుగురిపై కేసు!
Nelakondapalli: నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం ఉదయం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రెండు టాటా ఏసీఈ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 19 గోవులను నేలకొండపల్లి ఎస్సై శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అక్కపల్లి నుంచి హైదరాబాద్‌కు గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, వారిలో నలుగురిని అరెస్టు చేసినట్లు మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్సై వెల్లడించారు. పశువులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ గోశాల కు తరలిస్తునట్లు పేర్కొన్నారు.
కేసులో నిందితుల వివరాలు:
కళా శివ (అనకాపల్లి జిల్లా అక్కపల్లి)
జింజల వెంకటరమణ (అనకాపల్లి జిల్లా అక్కపల్లి)
కోన సింహాద్రి (అనకాపల్లి జిల్లా అక్కపల్లి)
కొర్ర ప్రసాద్ (బుచ్చిరాజుపేట ఏ.పి)
ఎర్ర వెంకట శివ (అనకాపల్లి జిల్లా అక్కపల్లి)
దెక్కారపు రమేష్ (బుచ్చిరాజుపేట ఏ.పి)




