Shettipalli: గ్రామంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Shettipalli: ఆమనగల్లు మండలం శెట్టిపల్లిలో కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరిస్తామని సర్పంచ్ జంగమ్మ తెలిపారు. అర్హులు రేపు పత్రాలు సమర్పించాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Aug 2026 6:04 PM IST
Shettipalli
X

Shettipalli: గ్రామంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

శెట్టిపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యమైన సమాచారం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం

శెట్టిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య మరియు పాలకవర్గం మాట్లాడుతూ కొత్తగా సామాజిక భద్రతా పింఛన్ల కోసం దరఖాస్తు* చేసుకోవాలనుకునే అర్హులైన వారికి ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాము.

పింఛన్లకు ప్రాధాన్యత కలిగిన వర్గాలు*

వితంతువులు

ఒంటరి మహిళలు

దివ్యాంగులు

కల్లు గీత కార్మికులు

నేతపనివారు

తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు*

పూర్తి చేసిన కొత్త దరఖాస్తు ఫారం

ఆధార్ కార్డు

వయస్సు నిర్ధారణ పత్రం

రేషన్ కార్డు లేదా వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం

బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ

వితంతువులకు – భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్

ఒంటరి మహిళలకు – విడాకుల పత్రం లేదా తహసీల్దార్ విచారణ నివేదిక

నేతపనివారికి – చేనేత & జౌళి శాఖ ధృవీకరణ పత్రం

కల్లు గీత కార్మికులకు – ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం

కావున శెట్టిపల్లి గ్రామంలోని పై వర్గాలకు చెందిన అర్హులైన ప్రజలందరూ ఈ సమాచారాన్ని గమనించి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని రేపు శెట్టిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మీ పత్రాలను సమర్పించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు..

అర్హులైన వారికి దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తాము.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story