Kothagudem: పినపాక ఎమ్మెల్యే పాయంను కలిసిన నూతన ఎస్ఐ పూదరి రఘు!

Kothagudem: ఎడుల్లబయ్యారం నూతన ఎస్ఐ పూదరి రఘు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల రక్షణపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 22 Oct 2026 7:08 AM IST
Kothagudem
X

Kothagudem: పినపాక ఎమ్మెల్యే పాయంను కలిసిన నూతన ఎస్ఐ పూదరి రఘు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎడుల్లబయ్యారం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పూదరి రఘు, పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ పాయం వెంకటేశ్వర్లు గారిని పినపాక క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన పూదరి రఘుకి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఎడుల్లబయ్యారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA