Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ధర్నా
Kothagudem: ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు.
Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా చేపట్టిన ఈ ఆందోళనలో మెడికల్ ఆఫీసర్లు, పల్లె దవాఖానాల వైద్యులు, ఏఎన్ఎంలు, కాంటింజెంట్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్హెచ్ఎంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 రకాల కేడర్లకు చెందిన 17 వేల మంది ఉద్యోగులు ఎన్హెచ్ఎంలో సేవలందిస్తున్నారని ఆందోళనకారులు తెలిపారు. పెరుగుతున్న ధరలతో కుటుంబ ఖర్చులు భారంగా మారుతున్నాయని, అయినప్పటికీ ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో.. అబ్దుల్ రెహమాన్ నాయక్ DDM, ఇమ్మానుయేల్ ఎపిడెమియాలజిస్ట్, వైద్యాధికారులు డాక్టర్ వెంకటేష్ , సుందర్, డాక్టర్ సందీప్..RBSK వైద్యాధికారి సుమంత్.. అకౌంటెంట్, శ్రీను DD, గోపి RM, వెంకటేశ్వర్లు ప్రియాంక , అరుణ, రాములమ్మ కాంటిజెంట్ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.




