Bhadradri: NHM ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మవద్దు: DMHO
Bhadradri: NHM ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మవద్దని, 95 పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుందని కొత్తగూడెం DMHO.
Bhadradri: NHM ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మవద్దు: DMHO
Bhadradri: NHM ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మవద్దు ఉద్యోగాలు పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తాం: DMHO డాక్టర్ తుకారామ్ రాథోడ్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఈరోజు అనగా 25-11-2026న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ .మాట్లాడుతూ, గతంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో ప్రకటించిన 95 పోస్టుల భర్తీకి సంబంధించి కొందరు దళారులు, మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. NHM పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల అర్హతలు మరియు మెరిట్ ఆధారంగానే నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగినా, మధ్యవర్తిత్వం చేసినా అటువంటి వ్యక్తుల మాటలు నమ్మకుండా వెంటనే పోలీస్ అత్యవసర నంబర్ *100* కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ప్రజలకు, ఉద్యోగ అభ్యర్థులకు పత్రికా ముఖంగా తెలియజేశారు.నిరుద్యోగులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికారిక ప్రకటనలు, సమాచారాన్ని మాత్రమే నమ్మాలని డాక్టర్ తుకారామ్ రాథోడ్ కోరారు.




