Julurupadu: జూలూరుపాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Julurupadu: జూలూరుపాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టిడిపి మండల కమిటీ. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు.
Julurupadu: జూలూరుపాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Julurupadu: తెలుగువారి ఆరాధ్య దైవం, యుగ పురుషుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకను జూలూరుపాడులో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పీజీ కృష్ణమూర్తి, స్వర్ణ నరసింహారావులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకును కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వడ్డే వెంకటనారాయణ, చావా వెంకటేశ్వర్లు, కొండ oవెంకన్న, పొదిల రామారావు, కళ్యాణం రమేష్, దుద్దుకూరి లక్ష్మణరావు, ఎల్లంకి పుల్లయ్య, తిరుమల రావు, సాయి ని నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




